శ్లో శ్రేయాన్ స్వధర్మో విగుణః
పరధర్మా త్స్వనుష్ఠితాత్
స్వధర్మే నిధనం శ్రేయ:
పరధర్మో భయావహః
కృష్ణుడు స్వదర్మము, పరధర్మము అనే వాటిని బోధిస్తూ వచ్చాడు.పరధర్మమంటే ఏమిటి? ఇంకొకరి ధర్మమా? పరధర్మమంటే ఇతరుల ధర్మము కాదు. అట్లే స్వధర్మమంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు సంబంధించిన కుల ధర్మములు కాదు. స్వధర్మము అనగా ఆత్మధర్మము." పరధర్మమనగా దేహ ధర్మము.స్వ అనేది కేవలం ఆత్మకు మాత్రమే సంబంధించినది. స్వ+ఇచ్చ- స్వేచ్చ " ఆత్మ నుండి ఆవిర్భవించినదే స్వేచ్ఛ. అదే స్వధర్మము. అదే నివృత్తి, అదే నిశ్చలమైన తత్వము.
(శ్రీ భ. ఉ..పు.28)
పరధర్మమనగా దేహధర్మము. స్వధర్మమనగా ఆత్మ ధర్మము అంతేకాని స్వధర్మమంటే క్షత్రియ ధర్మము. వైశ్య ధర్మము, శూద్రధర్మము, బ్రాహ్మణ ధర్మము యీ కులములకు సంబంధించినది కాదు. స్వధర్మము అనగా ఆత్మధర్మము, ఆత్మధర్మము ఎప్పటికి భయమును అందించదు. "పరధర్మో భయావహః" ఈ దేహ ధర్మము అనుసరించినప్పుడే మనకు భయము ఆవిర్భవిస్తుంది..
(బృత్రపు 154)