చేతులు పవిత్ర కర్మలయందు నియుక్తములు కావలెను. లోపల ఈశ్వరస్మరణ, బైట స్వధర్మాచరణ, చేతితో సేవాకర్మ, మనమున వికర్మ. ఇవి నిత్యకార్యక్రమము కావలెను. సంస్కారములన ప్రవాహము ఒక దిశలోనే పారుచుండవలెను. పర్వతములపై పడిన వర్షము అన్ని దిశలోనే పారుచుండవలెను. పర్వతములపై పడిన వర్షము అన్నిదిశలకునూ ప్రవహించిన దానివలన నది యేర్పడదు. అట్లుకాక నీరంతయూ ఒక దిశకే ప్రవహించినో దానివలన సెలయేరుగా, తరువాత ప్రవాహముగా, ప్రవాహము నదిగా నది మహానదిగా విస్తరిల్లుచూ వెళ్లి వెళ్లి సముద్రమును చేరును. ఒకవైపుననే ప్రవహించు నీరు సముద్రము చేరును. నలువైపులకూ ప్రవహించు నీరు ఏ కొందూరమోపోయి ఇమిడిపోవును. సంస్కారము కూడా ఇట్టిదే. సంస్కారములు ఇటువచ్చును. అటుపోవుచు నున్నచో ప్రయోజనమేమి? సంస్కారముల పవిత్రవాహిని జీవితములో నిరంతరము పవిత్రభావములతోనే ప్రవహించుచున్నదో చివరకు మరణము మహానందము నకు నిలయమనిపించును. ఎవడు ఇట్టి గమ్యమును చేరునో వాడు ధన్యుడు.
(ప్రే.వా. పు.5/6)