సంశయము సామాన్యమైనది కాదు. కంటిలోని నలుపు చెవిలోని జోరీగ, చెప్పులోని రాయి, కాలిలోని ముల్లు యేవిధముగ శాంతి లేకుండా చేయునోఅటులనే ఒంటిలోని సంశయము యింటిలోని పోరువలె హింసించును. ఇట్టి సంశయము ప్రజా ప్రతినిధిగా నిలచిన అర్జునునకు కలుగుటలో ప్రజల సంశయమనే భావించవలెను. దీనిని మానవాతీతమయిన మాధవుడే తీర్చగలడుకాని మానవ మాత్రులకు సాధ్యముకాదు.
కృష్ణా! నీవు పూర్వము ఈ యోగమును సూర్యునకు ఉపదేశించినట్లును తదుపరి సూర్యుడు మనువునకు బోధించినట్లునూ తెలిపితివి, సూర్యుడు మనువూ యే కాలమువారలు! నీవే కాలమువాడవు? పోనీ, ఏ కాలమైననూ సరే! ఈ దేహము తోనే ఉపదేశించితివా? లేక మరొక దేహముతో ఉపదేశించితివా? ఆ దేహముతోనే ఉపదేశించితిని అందునా! అదీ నమ్మ వీలుకాదు. ఈ దేహము నాతోపాటు ఇంచుమించు మూడు నాలుగు సంవత్సరములు పెద్దవాడనే కాని అంతకంటే ముందువాడవు కాదు! నాకు తెలియక యెప్పుడు ఉపదేశించితివి? సూర్యుడు చూతమా నీకంటే యెన్నో వేల రెట్లు పెద్దవాడు! ఆదికాలము వాడు! ఊహించుటకు కూడనూ వీలుకానిది. బావా: నేనే కాదు. ఈ విషయమును ఎంతటి తెలివి తేటలుగల వాడైననూ నమ్మడు. పోనీ. ఈ దేహమె కాదు! ఈ యుగమే కాదు! వేరొక యుగమూ, వేరొక దేహమని ఆందువా? అది మరింత అతుకనిమాట. యే జన్మముననో చేసిన కర్మలు ఈ జన్మముమ యెట్లు జ్ఞాపకముండును?కాని వుండునని నీవు ఒప్పుకున్నా నీవలె నాకునూ గడచిన జన్మలకర్మలు జ్ఞాపక ముండవలెనుకదా! యేదో దివ్య పురుషులకు మాత్రమే జన్మాంతర విషయము జ్ఞాపకముండునని శాస్త్రములు తెలిపినవి కాని సామాన్యు లందరికీ వుండవీలులేదు కదా! పోనీ నీవు దివ్య పురుషుడవని నమ్మననూ సూర్యుడు స్వయంగా దివ్యపురుషుడే! ఇద్దరు సమానమేనా! అదియునూ సరియని ఒప్పుకొన్నా సరిసమానమైనవారే కాని ఒకరికొకరు ఉపదేశించుకొనుట జరుగదే! నీవు ఉపదేశించితివన్న నీవు గురువు, సూర్యుడు శిష్యుడూ కావలెను గదా! అప్పుడునీవు సూర్యునికంటే గొప్పవాడుగా వుండవలెను కదా! వుండనీ గొప్పవాడవే, భగవంతుడవే అని విస్వసించిన మరింత సంశయమునకు చోటు యేర్పడును కదా! నీవు భగవంతుడవే అయిన సామాన్య మానవులవలె కర్మ పరతంత్రుడవై జనన మరణాది క్లేశములకు కట్టుపడు టెందులకు? నీవు అయిదడుగుల దేహముతో మానవా కారుడుగా సంచరించుటనీ నిరాకార సర్వ వ్యాపకత్వము నకు భంగము కాదా.
"అంతటి ఆనంతస్థానమైన సర్వవ్యాపకత్వము నుండి అల్ప స్థానమునకు జారుటకు కారణమేమి? యేమో! కృష్ణా! యెన్ని విధముల తర్కించిననూ నాకేమీ బోధపడుటలేదు! నీ మాటలు నీ కేసరి; నా తల తిరుగు చున్నది. యేదో సరియైన సమాధానము* చెప్పి నన్ను అనుగ్రహించుము" అని అర్జునుడు ప్రార్ధించెను.
(గీ.పు.58/61)
* సమాధాన ము
అప్పుడుమువ్వగోపాలుడుముసిముసినవ్వులు నవ్వుచూకాచినకాలం సమీపించినదనిసంతసించి, “బావా! విను. లోకులు - సూర్యోదయము, సూర్యాస్తమయమనిఅనుటలోఅర్థమేమి?
అదికేవలములోకులదృష్టియందేకానిసూర్యునిదృష్టియందుకాదు. సూర్యుడుఉదయించుటాలేదుఅసమించుటాలేదు, అవునా? కాదా? నేనునూఅంతే, నాకుజన్నమేలేదుసామాన్యమానవులదృష్టికినేనుఅనేకకాయములనుధరించిఅనేకజనులునెత్తితిననితలంతురు. లోకోద్ధరణమునకుఅవసరమొచ్చినపుడంతాఒకకాయముధరించిలోకమునకురూపనామములతోగోచరించిననూ, ఎన్నిజన్మలవిషయమయిననూనాకుజ్ఞాపకముండును. నేనుసర్వజ్ఞుడను, సర్వశక్తుడను. నాకేకాదు, నీకుకూడనూఅంతాతెలియును. అయితేనీజ్ఞానశక్తినిఅజ్ఞానముచేఆవరించుటవలననీకుతెలియజాలకున్నది. నేనుజ్ఞానమయుడను. కనుకనాకుసర్వవేళలయందునూస్పష్టముగాతెలియుచుండును. బావా! సూర్యుడుఅద్దములోఅగుపించినంతమాత్రమునస్థానభంగముకాని, అధికారభంగముకానీఏర్పడునా? ఉన్నవాడుఉన్నట్లేఉండిఅద్దమందుప్రతిబింబించుచున్నాడు. అటులనేనేనుకూడనుప్రకృతిఅనుఅద్దమందుప్రతిబింబించుచున్నంతమాత్రముననాసర్వజ్ఞత్వమునకు, సర్వశక్తికిభంగమురాదు; లేదు. నేనుజన్మరహితుడను. మానవజన్మమునకుమునుపుచేసినపుణ్యపాపకర్మలుకారణములగును. అయితే, అవతారజన్మలకుకూడనూఅవేకారణమనితలంతువేమో? కాదుకాదు. మానవజన్మకర్మజన్మ, నాజన్మలీలాజన్మ. ప్రార్థనలు, సాధుకృత్యములే. దుష్టులదుష్కర్మలు, సజ్జనులయొక్కసత్కర్మలేనాజన్మకుకారణముఅనికృష్ణుడుపదేశించెను.
(గీ.పు48)
సంశయములేవైనా స్ఫురించినపుడెల్లా ఇష్టమొచ్చినటుల ప్రశ్నించక, తరుణము, సమయము చక్కగా వున్నవేళ వాటిని శాంతమనస్కుడై మహనీయునికి తెలిపి దానిని నివారణ చేసుకొనవలెను కానీ వూరికే బండెడు పుస్తకములు చదివినంతమాత్రమున, ఉపన్యాసాలు గంటలు కొట్టినట్లు ఖంగుమనిపించిన గానీ, చిలక పలుకులు పలికిన గానీ, లేక దొంగ వేషములో కాషాయములు ధరించి ఊర్థ్వదృష్టితో బుర్రలూగించిన గానీ అది జ్ఞాని లక్షణము కాదు.
"వాటివలన జ్ఞానము చేకూరదు. దీనిని అనుభవజ్ఞులైన మహనీయుల ద్వారానే లభింపచేసుకొనవలెను,వారలను ఆశ్రయించవలెను. మానవుని సంశయములు తీరవలెనన్న శాస్త్ర పఠనముతో, గ్రంథపఠనముతో తీరునది కాదు. వీటి ద్వారా మరింత సంశయములు అభివృద్ధియగును ఇవి కేవలము తెలుపునవే కాని చేసి చూపించలేవు. చేసి చూపించువారు తత్వవేత్తలే కాన వారలను ఎంతో కాలమైననూ ఆశ్రయించక లభించు నట్టిది కాదు. ఈ పవిత్ర జ్ఞానము సముద్ర జలమును సరాసరి త్రాగినదాహము యేమాత్రమూ తీరదు: అది పోను నాలుకను కూడా చెఱచును. అట్లే శాస్త్రములనుండి సరాసరి సంశయము తీరదు. ఇంతియేగాక జ్ఞానమును కోరువారి స్థితిని కూడనూ గమనించవలెను. అట్టివానికి భక్తి శ్రద్ధలతో పాటు సరళభావముకూడా యుండవలెను. అట్టి స్థితిని కలిగినవానికే జ్ఞానము సిద్ధించును. అట్లు గాకఆత్రత కొద్దీ గురువును విసిగించకూడదు. ఎంత కాలమైననూ ఆశ్రయించి ఓపికతో సాధించవలెనే కాని ఆతృత పనికిరాదు. గురువు చెప్పినదానిని జవదాటక ఆచరించుచూ నిత్యానుభవమునకు తేవలెను. విన్నవాటిని, తిన్నవాటిని దినమొకటిగా రుచి చూచుకొంటూ, త్వర త్వరగా జ్ఞానికావలెనని దురాశపరుడై తనకు తోచినట్లంతా సాధనను మార్చుకొనుచుండిన అజ్ఞాని కాగలడు. ఒకపరి అట్లుకూడనూ అయిన యెంతో మేలు. రెండునూ కాక పూర్తిగా పిచ్చివాడయిపోవును. కాన ఈ విషయమును అతి జాగ్రత్త వహించవలెను.
(గీ .పు.86/87)
(చూ||సమాధాన ము)