సంవత్సరాది పండుగ అంటే ఏమిటి? భగవంతుని పేరుతో వచ్చేది సంవత్సరాది పండుగ. కనకనే కాలమంతా భగవంతుని స్వరూపమే. భగవంతుని యొక్క సహస్ర నామములలో కూడను సంవత్సరాయనమః" అని ఒక పేరుంది. సహస్రనామముల లోపల కాలకాలాయ నమః, కాలదర్పదమనాయనమః కాలాతీతాయనమః, కాల స్వరూపాయనమః - ఇవన్నియూ భగవంతుని యొక్క పేర్లే. కనుక సంవత్సరాది పండుగ అనగా పరమాత్ముని పేరుతో వచ్చిన పండుగ.
(స.సా.ఏ.91పు. 93/94)