సంతృప్తి

"అసంతృ ప్తో ద్విజో నష్ట...." అందువలననే మా కాలేజీలో పిల్లలకు చెపుతాను - Who is the richest man in the world? He who has the satisfaction ఎవరికి సంతృప్తి వుంటుందో అతడే ధనికుడు. "Who is the poorest man in the world? He who has many desires." ఎక్కువ కోరిక లేవని కున్నవో వాడే బీదవాడు.

(శ్రీది.పు.53/54)

 

సంతుష్ట సతతం అని చెప్పింది. భక్తి యోగము. దృఢనిశ్చయః" అని కూడను బోధించింది. సంతుష్టః సతతం నిరంతరము తృప్తుడై వుంటుండాలి. సంతృప్తుడై వుంటుండాలి. తృప్తివేరు, సంతృప్తి వేరు. గీతము సంగీతములో, కీర్తనం సంకీర్తనం అనే రెండింటిలో కొంత వ్యత్యాసము గోచరిస్తుంది. సమ్మక్ కీర్తనం సంకీర్తనం . కీర్తనం పాడటంలో కేవలము పెదవులనుండి గొంతునుండి వాక్యములు వెలువడవచ్చును. సంకీర్తన అనేది హృదయము నుండి కరగి, కదలి, స్వేచ్ఛతో, ఆనందముతో, భయభ్రాంతులు లేకుండా కావించుదానినే సంకీర్తనం అన్నారు. అదేవిధముగనే తృప్తి, సంతృప్తి. తృప్తి అనేది తాత్కాలికమైనది. ఇది వ్యవహారిక సంబంధమైనజగత్తునకు సంబంధించినది. ఇది ప్రాపంచికసంబంధమైన ప్రవృత్తి. సంకీర్తనమన్నట్టుగా సంతృప్తి కూడను. ఇది హృదయస్థాయి నుండి శాశ్వతమైనదిగను, సత్యమైనదిగను, పరమైనదిగను. నివృత్తికి సంబంధించినదిగను గోచరిస్తుంది. సంతృప్తికి మార్పులేదు. కూర్పులేదు. మార్పు కూర్పులేని నిత్యత్వముతో కూడినది సంతృప్తి.కనుక భక్తుడైనవాడు లౌకికసంబంధమైన ఫలమునకుగానీ లేక ఫలవిరుద్ధము నకుగాని యేమాత్రము చింతించక స్థిరమైన మనస్తత్వమును అభివృద్ధి పరచుకోవాలని దీని అంతరార్థము. జయాప జయములకు క్రుంగక పొంగక సమత్వము తో భావించుకోనే తత్వమే సంతృప్తి అనే పదమునకు అర్ధము. కనుకనే భక్తి యనగా ఎట్టి మార్పుము చెందనిది. ఎట్టి కూర్పును కలగనట్టిది.  నిశ్చలమై నిర్మలమై యుండుప్రేమతత్వము సంతృప్తి అని భావించవచ్చును. భగవంతుడు ఏది అనుగ్రహించినా, ఏది ప్రసాదించినాప్రేమ ప్రసాదముగనే భావించుకొని తృప్తి పొందాలి. ఇట్టి సమభావమును కలిగి యిట్టి సమత్వముచేత ప్రవర్తించే చిత్తమునే సంతృప్తి యని చెప్పవచ్చును.

(శ్రీ.గీ.పు. 18/19)

(చూ॥ అంతర్వాణి, అలవర్చుకోవాలి, కోరికలు)

 


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage