వర్ణములను బట్టి వృత్తులని భావింతురు. కానీ అట్లుకాదు వృత్తులను బట్టి వర్ణములు పిలువబడినవి. నేడు చూతమా, వృత్తులూ లేవు వర్ణములూ లేవు. నేడొక వృత్తి, రేపొక వృత్తి: నేడొక వర్ణము రేపొ వర్ణము! అందుకనే, అనేక విధముల అశాంతి. అసౌకర్యములు చెలరేగినవి. అమోఘమైన అంతర్ ధర్మమును, సత్యవ్రతమును, సహనదీక్షను బాహ్య వృత్తులయందు లగ్న పరచి, ఆయావృత్తుల వర్ణములను, వాని నిబంధనలనూ పాటించిన అదే సంతోషభిక్ష శ్రీరామరక్ష, లేకున్న ఒకరితో ఒకరికి కక్షదుర్భిక్ష లోకమునకొక శిక్ష, ఆట్టి శిక్షనుండి రక్షించునదే, ధర్మ శిక్షణ.
(జ.పు.132)