ధనము వలన దానమును - వాక్కు వలన సత్యమును ఆయువు వలన కీర్తియును, దేహము వలన పరోపకారమును. ఈ విధముగా పాలునుండి వెన్నవలె నిస్సారమైన సంసారమునుండి సారభూతమైన ఆత్మ సంపత్తును గ్రహింపవలెను. తత్త్వజ్ఞానాభిలాషగల బుద్ధిశాలులు, ధనికులయ్యునూ మదము లేకయు, యవ్వన వంతులయ్యునూ చాంచల్యము లేకయు, ప్రభువులయ్యునూ ప్రమాదము లేకయు సంచరించు చుందురు.
(జ. పు.23)