సంగీతము శాంతిదాయకం అందరికీ సంగీతం యిష్టమే. “శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః" అన్నారు. గానమాధుర్యానికి పిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, పశువులు, పాములు, అన్ని పరవశిస్తాయి. సంగీతాన్ని ఆశ్రయించి, భక్తి మాధుర్యం మరింతగా పెరుగుతుంది. శాంతి రసంలో పర్యవసిస్తుంది.
(శ్రీసా.గీ.పు.446)
(చూ|| మురళి)