ప్రేమస్వరూపులారా! ఈనాడు సంగీత యూనివర్సిటీకి శంకుస్థాపన చేశాము. కేవలం సంగీత సాహిత్య నృత్య కళలు మాత్రమే కాదు. ప్రాచీన సంస్కృతికి సంబంధించినడ్రామాలు, హరికథలు కూడా ఈ యూనివర్సిటీలో బోధింపబడతాయి. కొన్ని కోట్ల రూపాయల వ్యయంలో రూపొందుతున్న ఈ యూనివర్సిటీలో ప్రాచీన, ఆధునిక సంగీత సాహిత్యాలు రెండూ చోటుచేసుకుంటాయి. గొప్ప గొప్ప కళాకారులు వస్తారు. ప్రపంచంలోని అనేక సంగీత కళాశాలల్లో పని చేసిన ప్రఖ్యాత సంగీత విద్యాంసురాలు ఇందిరా చక్రవర్తి ఈ యూనివర్సిటీకి వైస్ చాన్సలర్గావస్తున్నిది. రవిశంకర్ (సితార వాద్వాంసుడు)ఉదయశంకర్ పేరు మీరు వినియుండవచ్చు. నృత్యకళలో అతనిని మించినవారు లేరు. అతని దగ్గర ఉండిన పరికరములను ఒక పది లారీలలో వేసుకుని ఇక్కడకు తెస్తున్నారు. అతని భార్య వచ్చి స్వామి వాటిని స్వీకరించాలని ప్రార్థించింది. ఒకవైపు మృదంగం, మరొకవైపు తంబుర, మధ్యలో శంఖము, సితార మున్నగువాయిద్యాల ఆకృతిలో ఈ భవనం నిర్మింపబడుతుంది. ఈ భవనాన్ని బయటి నుండి చూస్తూనే ఇది సంగీత యూనివర్సిటీ అని అర్థం కావాలి. ఇలాంటి అద్భుతాలు మన ప్రశాంతి నిలయంలో ఎన్నో జరగబోతున్నాయి. ఒకనాడు కేవలం 106 మంది జనాభా కల్గిన పుట్టపర్తిలోఈనాడు లక్షలు లక్షలు ప్రోగవుతున్నారు. ఇంతేకాదు. కొన్ని సంవత్సరములలో పుట్టపర్తి యావత్ర్ప పంచానికే ధృవతారగా వెలుగొందుతుంది. ప్రపంచ మ్యాపులో పుట్టపర్తి స్థానాన్ని పొందుతుంది. ఈనాడు శ్రీనివాస్ (సెంట్రల్ ట్రస్టు సభ్యుడు) చెప్పాడు కదా, అమెరికాలో వెలువడిన ఒక పుస్తకంలో మన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గురించి గొప్పగా వర్ణించబడింది. ఆమెరికాగాని, జపాన్‌గాని, జర్మనీగాని, ఇటలీగాని ఏ దేశానికైనా సరే మన పుట్టపర్తి ప్రధానమైనదిగా రూపొందుతుంది. మున్ముందు ఇది ఎంతో అభివృద్ధికి రాబోతున్నది. విద్యార్థులారా! నిజంగా మీ అదృష్టం ఎంత గొప్పదో! మీ అదృష్టవశాత్తు చిక్కిన ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అప్పుడే మీరు ఇక్కడ ఉన్నందుకు తగిన సార్థకతను పొందుతారు.
(స.సా.న.99పు.305/306)