నీవు ఎలాంటివాడివో చెప్పాలంటే నీ సంగమెలాంటిదో తెలుసుకుంటే చెప్పవచ్చు. కనుకనే ఐన్స్టీన్ చెప్పాడు. Tell me your company I shall tell you what you are అని. కనుక మన యొక్క మంచి చెడ్డలు కేవలము సంగములోనే ఏర్పడుతూ ఉంటాయి. భజబలంబు, మంచి బుద్ధిబలంబుండి
దైవ బలము లేక దాసుడగును
కర్ణుడంతటివాడు కడపటి కేమయ్యె
మరచిపోకు డిట్టి మంచిమాట.
కర్ణుడు మహాబలశాలి. మహాబుద్ధిమంతుడు, మహా శక్తిమంతుడు. కాని దుర్మార్గులైన దుర్యోధన దుశ్శాసనుల సహవాసముచే దైవాన్ని విస్మరించి దుస్పంగాన్ని విశ్వసించి, దుష్టచతుష్టయములో ఒకడైపోయాడు. దైవమునుదూరము గావించుకున్నాడు. దైవ బలమున్నప్పుడే సర్వ బలములు చేకూరుతాయి. ధర్మ బలమునుండినప్పుడే సర్వ బలములు చేకూరుతాయి.
(స.ది.పు.97)