ఏగృహమున భార్య భర్తలు ఆదర్శ జీవితము గడుపుదురో భగవన్నామమును సంకీర్తింతురో, సత్కారములు ఆచరింతురో, సత్యం, ప్రేమ, శాంతులతో ధార్మిక గ్రంథముల పారాయణ మొనర్తురో, ఇంద్రియముల వశపరచుకొని సర్వ జీవులయందును సమాన దృష్టితో సాధింతురో, ప్రేమను యిచ్చుదురో, అట్టి స్త్రీ నివసించు గృహము నిజముగా స్వరమే అగును.
అట్టి ఉత్తమ గృహిణియే నిజమను భార్య. ఏ స్త్రీ తన భర్తపట్ల హృదయమున అనురాగ బద్ధమై యుండునో ఆమెయే నిజమగు గృహలక్ష్మి. ఈ స్త్రీ తనభర్తపట్ల విశ్వసనీయమై యుండునో అమెయే నిజమగు ఇల్లాలు. ఆమెయే ధర్మపత్ని. భార్య ధర్మార్థ కామములకు మూలము. భర్త మన స్సెరిగి మధురముగా సంభాషించుస్త్రీ , భర్తకు భార్య మాత్రమే కాదు, ఒక్కొక్క సమయమున ధార్మిక కృత్యావసరముల తండ్రి వంటిది; వ్యాధి బాధల సమయములందు ఆమె తల్లి వంటిది..
(ధ.పు.33/34)
(చూః త్రికరణశుద్ధి, దైవం. ప్రాణము)