దుస్సంగానికి దూరంగా వుండాలి. దుస్సంగములో చేరితే మీలో ఉన్న పవిత్రమైన భావములు నిర్మూలమైపోతాయి. కైక మంథర మాటలను వినడంచేత తన స్వంత కుమారుడైన భరతుని కన్న మిన్నగా ప్రేమించిన రాముణ్ణి అరణ్యానికి పంపించింది. మంథర మాటలచేత ఆమె బుద్ధిలో మార్పు కలిగింది. అనగా, బుద్ధి దోషము కల్గినప్పుడు అసత్యం సత్యంగా గోచరిస్తుంది. సంగా దోషముచేత బుద్ధిదోషం ఏర్పడుతుంది. కనుకనే, నేను అప్పుడప్పుడు పిల్లలకు చెపుతుంటాను - ఇతరులతో ఎక్కువగా కలవకండవి. చిన్న వయస్సునుండియే దుస్సంగానికి దూరంగా ఉండాలి. సత్సంగంలో చేరాలి. ఆహోరాత్రములు పుణ్య కార్యముల నాచరించాలి. నిత్యానిత్య విషయ పరిశీలన చేయాలి.
(స.సా. న. 1999 పుట. 288)