విద్యలో రాముడు, రావణుడు ఇరువురూ సమానులే. కానీ, వాల్మీకి రావణుణ్ణి మూర్ఖుడని విమర్శించాడు. రాముణ్ణి దివ్యాత్మస్వరూపుడని వర్ణించాడు. కారణమేమిటి? రావణుడు తాను చదివిన చదువును ఆచరణలో పెట్టి జీర్ణించుకోకుండా దుర్మార్గంలో ప్రవేశపెట్టి దుర్వినియోగపర్చుకున్నాడు. రాముడు తన చదువును ఆచరణలో పెట్టి ఆనందాన్ని అనుభవించడమే కాక ఇతరులకు కూడా ఆనందాన్ని అందించాడు. "సర్వే సముదితా గుణై:", సమస్త సద్గుణములను పోషించుకున్నాడు. లోకహితాన్ని కోరటం, సంపూర్ణ జ్ఞానమును కల్గియుండటం, సమస్త సద్గుణములను పోషించుకోవటం ఈ మూడింటిద్వారా రాముడు తన దైవత్వాన్ని ప్రకటించాడు. ఈ మూడు ఎవరి యందుండునో వారందరూ దైవస్వరూపులే. అసలు ప్రతి మానవుడూ దైవ స్వరూపుడే. కాని, ఆత్మాభిమానమును తగ్గించుకొని దేహాభిమానమును అమితంగా పెంచుకోవడంచేత మానవునికి దివ్యత్వం బోధపడటం లేదు. దివ్యత్వాన్ని దర్శించాలనుకుంటే ప్రేమమార్గాన్ని అనుసరించాలి. కాని, మానవుడు విశాలమైన ప్రేమను పెంచుకోలేక సంకుచితమైన, లౌకికమైన సంబంధ బాంధవ్యాలను పెంచుకుంటున్నాడు. నేను, నావారు" అనే సంకుచిత భావాన్ని వీడి, లోకమంతా నావారే అనే విశాలమైన భావాన్ని పెంచుకోవాలి.
(స. సా.మే 99 పు.114)
విద్యలో రాముడు, రావణుడు ఇరువురూ |సమానులే. కానీ, వాల్మీకి రావణుణ్ణి మూర్ఖుడని విమర్శించాడు, రాముణ్ణి దివ్యాత్మస్వరూపుడని వర్ణించాడు. కారణమేమిటి? రావణుడు తాను చదివిన చదువును ఆచరణలో పెట్టి జీర్ణించుకోకుండా దుర్మార్గంలో ప్రవేశపెట్టి దుర్వినియోగపర్చుకున్నాడు. రాముడు తన చదువును ఆచరణలో పెట్టి ఆనందాన్ని అనుభవించడమే కాక ఇతరులకు కూడా ఆనందాన్ని అందించాడు. “సర్వే లోక హితే రత:”, రాముడు లోకహితాన్ని కోరాడు. “సర్వే జ్ఞానోప సంపన్న.", సంపూర్ణ జ్ఞాన స్వరూపునిగా | వెలుగొందాడు. “సర్వే సముదితా గుణైః”, సమస్త సద్గుణములను పోషించుకున్నాడు. లోకహితాన్ని కోరటం, సంపూర్ణ జ్ఞానమును కల్గియుండటం, సమస్త సద్గుణములను పోషించుకోవటం - ఈ మూడింటి ద్వారా రాముడు తన దైవత్వాన్ని ప్రకటించాడు. ఈ మూడూ ఎవరియందుండునో వారందరూ దైవస్వరూపులే. అసలు ప్రతి మానవుడూ దైవస్వరూపుడే. కానీ, ఆత్మాభిమానమును తగ్గించుకొని దేహాభిమానమును అమితంగా పెంచుకోవడంచేత మానవునికి దివ్యత్వం బోధపడటం లేదు. దివ్యత్వాన్ని దర్శించాలనుకుంటే ప్రేమమార్గాన్ని అనుసరించాలి. కానీ, మానవుడు విశాలమైన ప్రేమను పెంచుకోలేక సంకుచితమైన, (లౌకికమైన సంబంధ బాంధవ్యాలను పెంచుకుంటున్నాడు.
నేను, నావారు అనే సంకుచితమైన ప్రేమచేతనే | మానవుడు అనేక అవస్థలకు గురి అవుతున్నాడు. “నేను, నావారు” అనే సంకుచిత భావాన్ని వీడి, లోకమంతా నావారే అనే విశాలమైన భావాన్ని పెంచుకోవాలి. (శ్రీ వాణి ఏ ప్రియల్ 2022 పు 5)