ఈనాడు విద్యార్థులు Knowledge : Skill చేయటం లేదు KiII చేస్తున్నారు. KiII చేయటం వలన Balance తప్పుతున్నది. ఈ Balance తప్పటం వలననే Insight (ఆంతర్ దృష్టి) తగ్గిపోయి, Outlook (బహిర్ దృష్టి) పెరుగుతున్నది. మానవత్వాన్ని కోల్పోయిన విజ్ఞానం మారణహా మానికి దారి తీస్తుంది. విచక్షణా రహితమైన (Skill) నైపుణ్యం వినాశనానికి దోహదం చేస్తుంది. ఆలోచనారహితమైన మేధాశక్తి (Intellect) సర్వ నాశనానికి దారి తీస్తుంది. మేధా శక్తికి, నైపుణ్యానికి మధ్య సమతూకం Balance లోపించటం వలననే ప్రపంచంలో నేడు తరచుగా తుఫాన్లు, ఉప్పెనలు, భూకంపాలు సంభవిస్తున్నాయి. ఖనిజ సంపద కోసం భూమిని లోతుగా త్రవ్వి, తొర్ర చేయటం వలననూ, భూతలము మీద ఆకాశ హర్మ్యాలు నిర్మించడం వలననూ, సముద్ర గర్భము నుండి కోట్లాది టన్నుల చేపలను వెలికి తీయటం వలననూ, భూగర్భములోని వాయువును, చమురు నిక్షేపాలను ఖాళీ చేయడం వలననూ, అడవులను విచక్షణారహితంగా నరకడం వలననూ ఈ సమతూకం (Ecological Balance) లేకుండా పోయి తరచుగా ఊహించని అవాంతరాలు, భయంకర జల ప్రళయాలు భూకంపాలు సంభవిస్తున్నాయి. Skill నుండి S మైనస్ చేస్తే (Skill-S=Kill) Kill అవుతుంది.
(శ్రీవా.జా.97 పు.65)