వినాయకచవితి పర్వదినమున భారతీయులు కుడుములు ఉడ్రాళ్ళు మొదలగు పిండి వంటలు చేసి గణపతికి నివేదన చేయటం కద్దు. దీనియొక్క అంతరార్థాన్ని మీరు గుర్తించాలి. బియ్యపుపిండి, నువ్వులపిండి, బెల్లము కలిపి, తైలము లేకుండా ఆవిరపై ఉడికించి, వాటిని ఉండలుగా చేసి వినాయకునికి నైవేద్యం పెడుతున్నారు. నూనె లేకుండా ఆవిరిపై ఉడికిన పదార్థం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది కన్నులకు మంచి శక్తినిస్తుంది; ఆస్త్మా ఇస్నో ఫీలియా, ఉబ్బస వ్యాధులతో బాధపడేవారికి చాలా మేలు చేస్తుంది. ఈ విధంగా, భగవత్సంబంధమైన ప్రతి కార్యములోనూ ఒక అంతరార్థం ఉంటుంది. కాని, మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక పోతున్నాడు.
(స. సా..ఆ.2000. పు.290)
(చూ॥ గణపతి)