పాశ్చాత్య మత విశిష్టతకు భారతీయ మతమునకు భేదము స్పష్టముగ కనబడును. దేహము, మనస్సు, బుద్ధి అనునవి పాశ్చాత్యమునకు ముఖ్యము. అందు బుద్ధికే ప్రాధాన్యత, కాని భారతీయ సంస్కృతిలో దేహము మనస్సు, బుద్ధి చిత్తము, ఆత్మ ముఖ్యము. ఆత్మ వున్నతమైనది. భారతదేశములో అనేక మతములేర్పడి పైవానిలో భేదములు తెలుపుచున్నవి. మతము యేదైనను సామాన్యనీతులు ఒకటే. తల్లిదండ్రులయడల భక్తి, గురుభక్తి చెప్పుచున్నవి. సర్వ మతములలో దేవునిగూర్చి భేదాభిప్రాయములున్నవి. కాని నైతిక సూత్రములొక్కటే. నేడు యేసత్య నిత్యములు చెప్పెనో దానిని వీడి అసత్య అన్యాయములకు పాల్పడుచున్నారు. యే మతములు శాశ్వత సత్యములు చెప్పినవో వానియందు విశ్వాసముంచాలి.
( భ.ప్ర. పు.2)