ఫలములోని రసము తరులు తామెరుగునా
పువ్వులోని పరిమళము తీగెలనుభవించునా?
కావ్యాలలోని మధుర రసము గ్రంధములనుభవించునా
నివృత్తి సార పాండిత్యము ప్రవృత్తి పండితుడెట్లురుగును?
శ్లో!! ప్రవృత్తించ నివృత్తించ జనాన విదు రాసురా:
నశౌచం నాసిదాచారో నసత్యం తేషు విద్యతే||దైవాసుర సంప్ద్విభాగ 16-7||
నివృత్తి జ్ఞానమార్గము: ప్రవృత్తి కర్మమార్గము, వైదిక కర్మలు మోక్షసాధకములు కానేరవు. కేవలము చిత్తశుద్ధిని మాత్రమే చేకూర్చును. ప్రపంచమును ప్రపంచదృష్టిలో చూడక ఆత్మదృష్టితో చూచిన ద్వందములకు అతీతుడు కావచ్చును.
(శ్రీ భ.ఉ.పు.5/5)
(చూ॥ ప్రవృత్తి)