ఈ వయసులో ఉడుకు రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఎవరేమన్నా చాలా కోపం వస్తుంది. ఇది చాలా తప్పు. కామ, క్రోధ, లోభ, మోహ మద మాత్సర్యాలు మృగలక్షణాలు. మానవ లక్షణాలు కాదు. భయ పెట్టేది మృగం, భయపడేది పశువు. మీరు మృగం కాదు, పశువు కాదు. కనుక మీరు భయపడకూడదు. భయపెట్టకూడదు. ఈ రెండింటికీ అతీతమైన మానవునిగా మీరు జీవించాలి. పాపమునకు భయపడాలి. దైవమును ప్రేమించాలి. దుష్కర్మలకు దురాలోచనలకు, విషయభోగాలకు దాసులు కాకూడదు.
(దే.యు. పు. 13)