"శాంతి, సహనం, సత్యం, దయ, సానుభూతి, త్యాగం..... ఇలాంటి సద్గుణాలను పోషించుకోవడమే మానవధర్మం. అయితే, సమాజంలో కూడా మానవధర్మాన్ని అనుసరించ వలసియుంటుంది. నీకేది మంచిదని అనుకుంటున్నావో అది ఇతరులకు కూడా మంచిదని, అందరికీ మంచియే జరగాలని భావించు. నీకు ఏది చెడ్డదనిపిస్తుందో ఇతరులకు కూడా అది చెడ్డదే అని, ఎవ్వరికీ చెడు జరుగకూడదని భావించు. ఈ ప్రకారం వైయక్తిక ధర్మం సామాజిక ధర్మంగా పరిణమిస్తుంది.
(స. సా. మే. 2002 పు. 157/158)