మానవరూపములో దివ్య శక్తి 80 శాతము వరకు యుండుటయే దాని విశిష్టత, అద్వితీయత. జంతువు నందు ఆ శక్తి 15 శాతమే ఉండును. మానవుడు దివ్య పరివర్తనము సాధించి భగవంతునిలో ఐక్యము కాగలడు. జంతువు తన సహజ స్వభావము నుండి ఎప్పటికీ బయటపడలేదు. ఉదాహరణకు - ఒక పిల్లికి ఎంత మంచి ఆహార పదార్థములను పెట్టినా, ఎలుకను చూచిన వెంటనే, ఆ ఆహారమును వదలి పెట్టి అది ఎలుక కొరకు పరుగెత్తును. ఒక పులికి ఎంత శిక్షణ నిచ్చినా గింజలతో తయారుచేసిన ఆహారము దానికి రుచింపదు, సంతృప్తిని కలిగింపదు. పులికి సహజమైన ప్రేరణ మృగములను చంపి మృత శరీరములను భక్షించుట.
(ప.పు.281)