నిజమైన ప్రేమస్వరూపమే తల్లి. తల్లినుండియే ప్రేమమొట్టమొదట ఆవిర్భవిస్తుంది. ప్రతి మానవుడు పుట్టిన తక్షణమే తల్లి ప్రేమకు నోచుకుంటాడు. బిడ్డలకోసం తల్లి తన జీవితానైనా త్యాగం చేయడానికి వెనుకాడదు. ఇట్టి త్యాగము ఒక్క తల్లి యందు మాత్రమే గోచరిస్తుంది. కనుక తల్లిని గౌరవించి ఆమె అభీష్టాలను నెరవేర్చి ఆమెను సంతృప్తి పర్చడానికి ప్రయత్నించాలి. ఇదే నిజమైన పూజ. ఇదే నిజమైన తపస్సు. ఈ నవంబరు 19వ తేదిని మాతృమూర్తి యొక్క ఆరాధనా దినము (Mother s Day) గా పెట్టుకున్నాము. కారణం ఏమిటి? జన్మకు మూలకారణం తల్లి. ఎక్కడైనా చూడండి. మదర్ ల్యాండ్ అంటున్నారు. గాని ఫాదర్ ల్యాండ్ అంటూన్నారా ? మాతృభాష అంటూన్నరుగాని పితృభాష అంటున్నారా?మనం నివసించే ప్రపంచమంతా మాతృస్వరూపమే. మన జీవితమంతా తల్లి వరప్రసాదమే.
(స.సా.డి.96పు.329)