భారతదేశంలో మాతృస్థానాన్ని కలిగినవి కొన్ని ఉన్నవి. జన్మనిచ్చిన దేహమాత,క్షీరాన్నందించి పుష్టిని సంతుష్టిని చేకూర్చే గోమాత, నిధినిక్షేపాదులను ధనధాన్యాదుల నందించే భూమాత,సంస్కృతిని సంప్రదాయమును ఆచారములను కట్టుబట్ట నందించిన దేశమాత,జీవిత ధ్యేయాన్ని హెచ్చరించి మార్గాన్ని ఉచ్ఛరించి మోక్షమును ప్రబోధించి ఆనందాన్ని, జన్మరాహిత్యాన్ని ప్రసాదించే వేదమాతమాతృస్థానమున నిలచి పూజార్హులైనారు. ఆకారణంగా ఈ దేశంలో మాంసం ప్రజామోదాన్ని పొందలేదు.
(శ్రీన.2000పు.36)