ఇంద్రియములకు ‘మాత్ర అని పేరు. మీయేతే ఇది మాత్ర: అని. ఇంద్రియములు, మాత్రలు కొలతలు వేయబడేటువంటివి. కొలతలువేయునవి ఇంద్రియములే, ఇట్లా? పప్పుకు తగిన ఉప్పు లేదు అని దీనికి తగిన కొలతలు వేసి చెప్పునది నాలుక. మనిషి చాలా ఆందముగా ఉంటున్నాడు కానీ ముక్కు చాలా చిన్నది అని కొలతవేసి చెబుతుంది కన్ను. ఈ విధంగా మంచి చెడ్డలను గుర్తించి ఉచ్చరించునవి యీఇంద్రియములు, మాత్రకు మరొక విశిష్టత ఉంటున్నది. ఒక పరిమితములో దీనిని ఉపయోగించు కోవాలి. భగవంతుడు ప్రసాదించిన ఈ ఇంద్రియములను పరిమితముగా ఉపయోగించికోవాలి. పరిమితమునకు మించినప్పుడు భగవదాజ్ఞ ఉల్లంఘించిన వాడుగుటయే కాక దీని వల్ల అనే కష్టములకు నష్టములకు రోగములకు గురికావలసి వస్తుంది. భగవంతుడు ఏ నిమిత్తమై ఏ ఇంద్రియములను ప్రసాదించాడో ఆఇంద్రియములను ఆ నిమిత్తమై సక్రమమైన మార్గములో ప్రవేశపెట్టి అనుభవించటానికి ప్రయత్నించాలి.
(ద.. స.స....పు.27)
‘మాత్ర’ అనే దానికి ‘పరిమితమైన పద్ధతి అని అర్థము. ఏది వినవలెనో దానిని మాత్రమే వినాలి మనము. వినవలసిన దానిని విస్మరించి వినని దానిని విశ్వసించి ఈ శ్రవణమును నాశనము చేసుకుంటున్నావు. సూరదాసు చెప్పాడు.
చెవులుండి చెవుటులై ఆతి మనోహరమైన
నీగాన మాలింప నేరరైరి
కన్నులుండి గ్రడ్డులై కళ్యాణకరమైన
నీరూపు దర్శింపనేరరైరి.
కన్సూలెందుకిచ్చాడు భగవంతుడు? అడ్డము వచ్చిన వానిని చూడటం కోసమనా. కాదు కాదు. మంచిని చూసే కోసమని, పురందరదాసు కూడా చెప్పాడు.
(ద.స.స.పు.29)