మానవాళి కంటే సృష్టి చాల విశాలమైనది. ఈ సృష్టికి మానవత్వమునకు సన్నిహిత సంబంధమున్నది. తల్లిపాలు బిడ్డ త్రాగినట్లుగా, పూవులోని మకరందమును తుమ్మెదగ్రోలినట్లుగా ప్రకృతిలోని వనరులను మానవుడు అనుభవించటంలో ఎట్టి అభ్యంతరమూ లేదు. కానిఈనాటి మానవుడు మితిమీరిన ఆశలచేత ప్రకృతి వనరులను దుర్వినియోగం చేస్తున్నాడు. అందుచేతనే ప్రకృతిలోని బ్యాలన్సు తప్పిపోయి భూకంపములు, ఉప్పెనలు, కరవు కాటకముల వంటి ప్రకృతి వైపరిత్యాలు సంభవిస్తున్నాయి. తాను కూర్చున్నటువంటి కొమ్మను తానే నరుక్కుంటున్నట్లుగా ఉన్నది. ఈనాటి మానవుని పరిస్థితి.
(స. సా.మా.97వు.64)