ఇంద్రియములను మనసు నిలిపిన అంధుడైనను పొందుమోక్షము.
ఇంద్రియములను మనసు నిల్పిని చంద్రుడైనను సంతునొందడు.
కుక్క తిన్నవాడు గురుజంగ లింగము
పంది తిన్నవాడు పరమగురువు
ఏనుగు తిన్నవాడెంత సుజ్ఞానియో
విశ్వదాభిరామ వినురవేము.
ఇందులోని అంతరార్థాన్ని మనం విచారించాలి. కుక్కక్రోధము. పంది-అహంకారము, ఏమగు మదము. ఈ మూడింటిని అరికట్టుకున్న వాడు మాహాయోగి అన్నాడు వేమన. యావత్ దేశమునందు అనేక రకములైన యోగాలు మనం వింటూ ఆచరించటానికి పూనుకుంటున్నాం.యోగాలు అనేకం ఉన్నా అన్నింటిలోనూ ప్రధానమైనది పతంజలి యోగం. "యోగః చిత్తవృత్తి నిరోధకః",ఇంద్రియములు అరికట్టక మనము ఎట్టి కార్యము లందైనను సుఖసంతోషాలు పొందలేము. విచ్చలవిడిగా విడచిన యింద్రియములద్వారాదు:ఖమే సంప్రాప్తమవు తుంది. భారతీయులు ఈ తత్త్వాన్ని విచారణ చేయటం లేదు. ఇంద్రియ నిగ్రహమును విరుద్ధంగా భావిస్తున్నారు. ఇంద్రియ నిగ్రహమనగా ఇంద్రియములను సక్రమ మార్గంలో ప్రవేశింపజేసి తద్వారా హృదయా నందాన్ని అందుకోవటానికి పూనుకోవటమే.
క్రోధము, అహంకారము, మదము, మానవుని ఉన్మత్తుచేసి అహంకారిగా తయారు చేస్తాయి. మానవత్వంలో వున్న ప్రజ్ఞాన, విజ్ఞాన, సుజ్ఞానములను తెలిసికొని వానివల్ల ఆత్మానందాన్ని అనుభవించాలి. ఈనాడు లోకంలో మనం చూస్తున్న అలజడులకు. అల్లకల్లోలాలకు యింద్రియము లను విచ్చలవిడిగా విడిచి పెట్టటమే ముఖ్యకారణం. ఇంద్రియములను విచ్చలవిడిగా సంచరింపజేయటంచేత విచారణ శక్తి శూన్యమైపోతుంది.
(వే.ప్ర.పు.148/149)
(చూ॥ శ్రేష్టుడు)