పాండవులు, కౌరవులూ నేడుగూడునూ యుద్ధము చేయుచునే ఉన్నారు. సూక్ష్మరూపులై. ఇందులో దుర్గుణములే కౌరవులు, సద్గుణములయిన సత్య, ధర్మ, శాంతి. ప్రేమ, అహింసలను ఐదు గుణములే పంచ పాండవులు. దుర్గుణములను కౌరవులు లెక్క లేనంతమంది వున్నారు. వారికి, వారికి ప్రతి ఒక్కరి హృదయాకాశము క్రిందే చిత్త భూమియందే యుద్ధము జరుగుచున్నది. హృదయరాజ్యాధిపతులే వారు. అజ్ఞాని, సుజ్ఞాని అనే పేర్లతో అందరి యందూ ఉన్నారు. అజ్ఞాని అయిన గ్రుడ్డి వాడే ధృతరాష్ట్రుడు. సుజ్ఞాని అయిన పాండురాజు సద్గుణముల తండ్రి..
అనేకములైన రథములూ, సైన్యమూ, ప్రజలూ, వారంతా మానవుని యందే వున్నది. వివిధమైన అనేక భావములే ప్రజలు. దశేంద్రియములే సైన్యము, పంచేంద్రియములే రథాలు. అట్టి సైన్యముతో. ప్రజలతో, ప్రతి ఒక్కరి హృదయమందు నిత్యమూ పాండవులు కౌరవులను సద్గుణ దుర్గుణములు యుద్ధము చేయుచునే యున్నారు. కృష్ణపరమాత్మ ఆత్మ అను పేరుతో సాక్షీభూతుడై యున్నాడు. జీవిత రథసారధే అతడు
సూక్ష్మ రూపమున సంచరించు సర్వసైన్య, కథ, కౌరవ, పాండవులకు నిలయమైనది. అస్థి పంజరమే.కాన, అస్థి పంజరమే హస్తినాపురము. ఎట్లన ఆస్థూలహస్తినాపురమునకూ నవ ద్వారములు. దీనికీ నవ ద్వారములు.కౌరవ పాండవులు పుట్టినది, పెరిగినది, - విద్యలు నేర్చినది. కడకు యుద్ధము చేసినది, ఒకే స్థలమందు. ఇక్కడ గూడ దుర్గుణ సద్గుణములు పుట్టినది, ఆడినది, పాడినది, సర్వమూ చేర్చినది, కడకు రెండింటికి వైరము వచ్చినది, ఒకే అస్థిపంజరమైన దేహమందే కాన దేహమే హస్తినాపురము. ఇందులోని రాజులు, అజ్ఞాని. సుజ్ఞాని.
ఎప్పుడు దుర్గుణ సద్గుణములు ఒక్కటయి. గుణ రహితులు కాగలరో అప్పుడే శాంతి ఏర్పడును.
వ్యామోహములను ప్రజలున్నకదా యుద్ధమును జరిపింతురు?
అట్టి ప్రజలే లేకున్న యుద్ధమూ లేదు. కాన, మొదట వ్యామోహములు, మమకార అహంకారములూ లేకుండా చేసికొన్న శాంతిగా ఉండవచ్చును. అట్టి శాంతికి ప్రయత్నించు. ఊరికే సందేహములు పెట్టుకొనుట కూడా ఒక వ్యామోహమే. దీనిని గూడా లేకుండా చేసికొనుటకు ప్రయత్నించు.
(శ్రీ స.సూ.పు.255/256)