నిజంగా హృదయంలో ప్రేమనే ఉంటే ఎక్కడికి వెళ్ళినా అది మార్పు చెందడానికి వీలులేదు. దీనికి చక్కనిదృష్టాంతము. ఒక కాగితంపై ఒక పూల తీగ బొమ్మ గీసాము. బయట గాలి ఎంత వీచినా కాగితము అల్లాడుతుంది గాని, దానిపై గీసిన పూల తీగ ఏ మాత్రము అల్లాడదు. అదేవిధముగా సంగదోషముచేత మనస్సు అటూ, ఇటూ కొంత కదిలినప్పటికీ హృదయంలో ఉన్నప్రేమ మారుటకు వీలుకాదు. ప్రేమ త్రికోణ స్వరూపము. ఒకటి ప్రేమకు భయమే లేదు. రెండు ప్రేమ పరులను Beg చేయదు. మూడవది ప్రేమ ప్రేమనిమిత్తమై ప్రేమిస్తుంది. ఈ మూడు ప్రేమకు ప్రధాన ప్రాణములు.
(శ్రీ బ..పు.200/201)