ప్రశ్నలు అడుగుటకు నాలుగు కారణము లుండును. 1. తుచ్చము, 2 కనిష్టము, 3. మధ్యమము, 4. ఉత్తమము, అని నాలుగు కారణములు. ఇందులో:
వివాదార్థము, ఒకరిని ఓడించుటకు ప్రశ్నవేయుట; ఇది తుచ్చము 2. వాక్చాతుర్యము జూపించుటకు ప్రశ్నవేయుట; ఇది కనిష్టము 3. బుద్ధిచాతుర్యము చూపించుటకు ప్రశ్నించటము: ఇది మధ్యమము 3. సందేహములను నివృత్తిచేసుకొనుటకు ప్రశ్నించుట; ఇది ఉత్తమము.
(రా.వా.రె.పు. 10)