మన పూర్వసంప్రదాయాలను యీనాటి మానవుల హృదయాలలో మరల నాటవలసి ఉన్నది. ఇంతవరకుమానవుడు యీ ప్రపంచ నాటక రంగము పై హాస్య నటునిగా, సేవకునిగా, భిక్షకునిగా ఎన్నెన్నో వేషాలను ఎంతో కాలం నుండి అభినయిస్తున్నాడు. ఇప్పుడు నాయకపాత్ర ధరింప వలసిన సమయం ఆసన్న మయింది. ఆ పాత్రధారణకు తగిన యోగ్యతను అతడు సంతరించు కొనవలసివున్నది. ఆ అర్హతలను తెలియజేసే వారందరినీ (వేద పండితులను) ఒక వేదిక మీదికి చేర్చేటందుకే యీ ప్రశాంత విద్వన్మహాసభ స్థాపించడ మైనది.
(యు. సా.పు.53)