త్రయిరూప మగు వేదవాక్కు ప్రధమజా అని కీర్తింపు బడినది. ‘ఉపస్థాయి ప్రథమ జాం అని అనుటచే ప్రథమజా అను వాక్కును సేవించుట వలననే విద్య సిద్ధించు చున్నదని చెప్పబడినది. అనగా వేద వాక్కును సేవింపనియెడల బ్రహ్మ విద్య సిద్ధింపదని దీని తాత్పర్యము. వేదవాక్కు కేవలము అర్థము తెలిసి భావపూరితముగసేవించినప్పుడే వేద విద్య సిద్దిని బడయవచ్చునే కాని కేవలము నోటితో ఉచ్చరించినంత మాత్రమున వేద విద్య సిద్ధి లభించిందని కూడా ఈ వాణి స్పష్టపరచినది. ఋగ్వేదము నందు ప్రథమజా, పూర్వజా అను పదములు వేదము యొక్క అనాదిత్వమును చాటుచున్నవి. అందుచేతనే రామాయణమును వ్రాయుచు వాల్మీకి ఈ వాక్కును అగ్రవాక్ అని కీర్తించినాడు. వేద వాక్కునే కాక హిరణ్య గర్భునకు కూడా, ప్రథమజా అని ప్రథమోత్పన్నమైన -దగుటచే బ్రహ్మను బ్రహ్మవిద్యను ప్రథమజా అని శ్రుతులు కీర్తించినవి.
బ్రాహ్మదేవానాం ప్రథమ:
బ్రహ్మదేవునకు, హిరణ్యగర్భునకు ప్రథమజా అను పేరు వేదమున కన్పట్టుచునే యున్నది.
హిరణ్య గర్భునకంటె పరబ్రహ్మకు ప్రాధాన్యముండుటచేబ్రహ్మ ప్రథమజా అయినది. ప్రథమజా అనగా అనాది సిద్ధమగు వాక్కు ఇది. పరబ్రహ్మముఖమునుండి ఆవిర్భవించినది అని అర్థము. ప్రథమజా అను నామము సార్థకము అయినట్లే
అర్షపదము కూడా బ్రహ్మ వాక్యమైన వేదమునకు ప్రసిద్ధము. మీమాంసాది న్యాయముచే -పరిశీలన చేయువాడే ధర్మజు డు.
(లీ.వా.పు.15/16)
(చూ|| ఋగ్వేదము)