మీరు నన్ను ఫోనులో పిలవవచ్చు. భగవంతుని కోసం నిజమైన నిశ్చలమైన పరితాపం హృదయాలలో వున్నవారికే నేను పలుకుతాను. నువ్వు నా ప్రభువువి కాదు అన్న వారితో కాదు అంటారు. నువ్వే నా దైవం అన్నవారితో అవును అంటాను. నేను మీ హృదయాలలో వుంటే, ఈ టెలిఫోను ద్వారా పలుకుతాను. నాకు ఒక ప్రత్యేకమైన తంతి తపాలా శాఖ వుందని మరచిపోకండి. ఆ పరికరాలు మన హృదయాల మధ్య పనిచేస్తాయి. మీ హృదయాలనూ నా హృదయమునూ కలుపుతున్న తంతితపాలా శాఖ కొన్ని నిబంధనలకు లోబడి పనిచేస్తూ వుంటుంది. ఆ నియమావళినే శాస్త్రాలు ప్రకటిస్తున్నవి. వాటిని మీరు శాస్త్రాల ద్వారా తెలుసుకోగలరు.
(వ.1963 పు.64)