చాల మంది కొన్ని భ్రాంతులకు లోబడి పోతుంటారు మమ్మల్ని ఉద్దరించేవారు మా పుత్రులే అనుకుంటారు. ఎందుకంటె తమకు శ్రాద్ధములు పితృపిండములు వదులు తుంటారు. దానివల్ల వీరికి వుద్దారము కలుగుతుందని వీరి భ్రాంతి. లోకములో ఎంతమంది పుత్రులు కలిగినవారు లేరు. వీరిని పుత్రులు వుద్దారము చేస్తున్నారా? పుత్రులు లేనివారు ఎంతమంది లేరు? వీరందరు ఆధోగతి పాలౌతున్నారా? "పుత్రుల్ పుట్టరె కౌరవేంద్రునకనేకుల్ వారిచే ఏగతిన్ బడసెన్ పుత్రులు లేని ఆ శుకునకున్ పెంపొందెనే దుర్గతుల్ " వీరుకాదు మనలను ఉద్గారము చేసేది. చేసే ఆచారములఅర్థము కూడను మనము గుర్తించుకోవటం లేదు. శ్రాద్ధము అంటాము. బ్రాహ్మణుని పిలిపించటము, ఆతనికి పాదాలు కడగటము, పొట్టనిండా అన్నం పెట్టటము, వానిచే అక్షింతలు వేయించుకోవటం యిది శ్రాద్ధమైపోయినది అనుకుంటాము. శ్రాద్ధమనగా శ్రద్ధతో కూడినదని అర్థము. పిండదానములు చేస్తారు. పిండమనగా దేహమే! శ్రద్ధతో మనదేహమనే పిండమును భగవంతునికి అర్పితము గావించటమే నిజమైన శ్రాద్ధము, ఇది పిండదానము.
(బృత్ర.పు.139)