పాశ్చాత్య విద్యలప్రభావ మది యేమొ
ఆర్యధర్మము లెల్ల ఆరిపోయె
పాశ్చాత్య విద్యల ప్రాముఖ్య మది యేమొ
పరిణయ ధర్మముల్ వమ్ములయ్యె
పాశ్చాత్య విద్యల ప్రభావమది యేమొ
వేష భాషల యందు మోజా హెచ్చె
పాశ్చాత్య విద్యల ప్రభావమది యేమొ
సంస్కృత మడుగంటి సన్నగిల్లె
తల్లి భాషను మాట్లాడ తప్పుతోచె
సంఘ మర్యాద పాటింప జంకు పుట్టె
ధర్మమన్నది భోధింప తప్పిపోయె
గురువుల పై గౌరవము సన్నగిల్లె
(స.సా.డి.96పు.322)