యముడు ప్రాణులను తన లోకమునకు లాగుకొని పోవుటకు ఉచ్చుత్రాడు తీసికొని రాడు, ఆ త్రాడును, వధ్యుడగు ప్రాణి, స్వయంగానే తయారు చేసికొనును. వాడు దానిని మెడకు తగిలించుకొని, యముని రాకకెదురుచూచుచుండును. ప్రతి ప్రాణము, అనుక్షణము - తాను చేయు కర్మమను పాశమును మెడకు చుట్టుకొనుచునే యుండును. క్రమక్రమముగా పురి యెక్కి యెక్కి పెనుచుకొని, అంతిమ క్షణమున నదియే వానిని యముని కడకు లాగుకొని పోవును. నీవు నీ వాస్తవ స్థితిని తెలిసి కొంటివేని, దేహమే నేనన్న భావ మంతరించును. దానితో నీకున్న యశాంతి యంతయు పోయి, పరిపూర్ణ శాంతి ప్రాప్తించును. దేహమునేను కానన్న సత్యమును తెలిసికొనుట, చాల సులభము.
(స.వ.పు.96)