ఏగుణంబు గణించి ఏ తెంచెనోనాడు
ప్రహ్లాదు పాలింప పరమ పురుషు
డేగుణంబు గణించి ఏ తెంచెనోనాడు
పేదకుచేలుబ్రోవ వేద చరితు
డే గుణంబు గణించి ఏతెంచెనో నాడు
కరిని గాచెడు తఱి కమలనయను
డే గుణంబు గణించి ఏతెంచెనో నాడు
ధృవకుమారుని సాక వైకుంఠవాసు
డాగుణంబు గణించి ఈ అమర వంద్యు
గుణంబు గణించి ఈ అమర వంద్యు
డార్తజననాధుడీనాడు అవతరించె
శ్రీనివాసుండు లోకైక చిన్మయుండు
వెల్గె పరీశుడు పృధివి యందు
(యు.అ.సా..పు. 115)