పరోపకారాయ ఫలంతి వృక్షా: పరోపకారాయ వహంతి సద్యః
పరోపకారాయ దుహంతి గావః పరోపకారార్థమిదం శరీరం.
వృక్షాలు ఫలాలను, నదులు జలాలను, గోవులు క్షీరాన్ని అందిస్తున్నాయి. పరోపకారమనే ప్రకృతిధర్మానికి తన శరీరమును అంకితం చేసి మానవుడు తన జన్మను సార్థకం చేసుకోవాలి.
(ప్రే..బం.పు.21)
కోటి విద్యలను నేర్చినను, త్యాగబుద్ధి ఒక్కటి లేకున్న, నేర్చిన విద్యలన్నియూ నిష్ప్రయోజనము. పరోపకారబుద్ధి విద్యలో ప్రధాన సూత్రము. పరోపకారబుద్ధి శ్రేష్టమైన విద్య, ఇతరులకు ఉపకారము చేయునప్పుడు, స్వార్థమును సంకుచిత భావము మనస్సున యేమాత్రమూ వుండరాదు. అంతేకాదు, ఉపకారభావముతో ప్రతిఫలమును ఆశించరాదు. యెట్టి ఫలాపేక్ష లేక పరోపకారమను ప్రధానయజ్ఞమును దృష్టియందుంచుకొన వలెను.
(వి.వా.పు.67)
(చూ||అ వతారము, నరజన్మ)