విల్సన్ అనే వాడు పరాశర మహర్షి రచించిన పురాణములను ఇంగ్లీషులోకి తర్జుమా చేసాడు. ఈ కలియుగమునందు పర్తి అనే గ్రామంలో సత్యఅనే పేరుతో ఐదడుగుల మూడు ఇంచ్ లు పాడవుగల వ్యక్తి ఉద్భవిస్తాడని పద్మపురాణంలో ఉన్నది. అతడు యావత్ప్రపంచమును ఆకర్షించే బిగెస్ట్ మేగ్నెట్ అని కూడా అందులో ఉన్నది. భారతీయుల భవిష్యత్తు గురించి పరాశరమహర్షి నాడీ గ్రంధములో అనేక విధములుగా వ్రాస్తూ వచ్చాడు. భారతీయ సంస్కృతి అన్ని రంగాలలోను దివ్యమైన భావముల చేత యావత్ప్రపంచమును ఆకట్టు కున్నది. భారతములో లేనిది ఏ దేశములోను లేదు. ఇట్టి భారతీయ సంస్కృతి ఈనాడు భారతీయులే విస్మరిస్తూ వస్తున్నారు.
(.స.సా..జులై.96పు.179)