మీయింట్లో కరెంటు వేసి దీపాలు వెలిగించాలంటే, పవరు హౌసు నుండి మియింటిదాకా అక్కడక్కడా స్తంభాలు పాతి, తీగలను వేసి, మీయింటికి కనెక్షను ఇవ్వాలి. అలాగే భగవంతుని అనుగ్రహము పొందాలంటే ప్రతిరోజు నియమిత వేళలలో సాధన చేసి నామస్మరణ అనే తీగల ద్వారా భగవంతునితో అనుసంధానము చేసుకో, నామస్మరణ ఉత్తమోత్తమమైన సాధన. - నామస్మరణ చేస్తున్నప్పుడు ప్రతి నామము వెనుకగల భగవంతుని వైభవమును గుర్తు చేసుకో."
(దైపు. 327)