మానవుడు పరిపూర్ణుడు కావాలంటే ఒక చిన్న ఉదాహరణము ఒక విత్తనము మనము భూమిలో నాటుతున్నాము. విత్తనము నుండి చిన్నగా రెండు ఆకులతో మొక్క బయలుదేరుతుంది. ఇది క్రమక్రమేణా కొమ్మలతో రెమ్మలతో పాటు రూపొందుతుంది. తదుపరి ఆవృక్షము మనకు ఫలములు అందిస్తుంది. ఇదే విత్తనము యొక్క పరిపూర్ణత్వము. కాబట్టి మానవత్వమనేది ఒక విత్తనమువంటిది. దానిని అనేక రకములుగా మనము సంస్కరించినప్పుడు, అదే ఒక విశాలమైన ప్రేమతత్వము గా కొమ్మలు రెమ్మలుగా రూపొందుతుంది. తదుపరి శాంతిభద్రతలనే ఫలాన్ని, యీ వృక్షము అందిస్తుంది. అదియే మానవుని యొక్క పరిపూర్ణత.
(బృత్ర.పు.9)