మన కంటికి కనుపించేది, మనతనువును మరిపించేది, మనసును మురిపించేది. మనమనుగడ వెలియించేది ఈ భౌతిక ప్రపంచము. ఈ పార్థివమైన ప్రపంచములోనే అపార్థివమైన పరమార్థమున్నది. ఈ రెండూ ఒకే అఖండ చైతన్యంలోని విచ్ఛిన్నమైన అంశాలు. దేనికదే పరిపూర్ణము. ఒకదానికొకటి పరిపూరకం. పరిపూర్ణమైన పరబ్రహ్మతత్త్యము నుంచే పరిపూరకమైన జీవతత్త్యం ఉదయించింది. జీవతత్త్వమునుండి శరీరము విడిపోయిన తరువాత శేషించినపుడే నిరంతర చైతన్యము కూడా పరిపూర్ణమైన పరబ్రహ్మతత్త్వమే.
"పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే!"
ఈ ప్రపంచము పరమేశ్వరుని లీలా విలాసముతప్ప మరేమీ కాదనే పరమసత్యాన్ని ప్రబోధిస్తుంది. విద్య,
(వి.వా.పు.3/4)