విచ్చలవిడిగ పరుగెత్తునటువంటి జ్ఞానేంద్రియము లను అరికట్టుము. వ్యాధి కారణము తొలగుచున్నది. మనసు, దాని చేష్టలను గమనింపుము. ఆలోచనలను పిచ్చి ప్రవాహమును అడ్డగించుము. ఆలోచన అలజడి తగ్గుటకు నామమును ఉచ్చరించుము. దానివలన మనసునందు దుఃఖ బాధలకు చోటుండదు. మనసు పావనము కాగా జ్ఞానోత్పత్తి కలుగును. అతడే పరిపూర్ణ మానవుడు.
(ధపు 21)
(చూ|| తలంపులు)