ఈనాడు ప్రధానంగా మూడు విధములైన పరివర్తనలు జరగాలి. మొట్టమొదట ఆధ్యాత్మిక పరివర్తన, తరువాత సాంఘిక పరివర్తన, తదుపరి వ్యక్తి యొక్క పరివర్తన. ఆధ్యాత్మిక పరివర్తన జరిగినప్పుడు సహజంగానే సంఘంలో పవిత్రమైన పరివర్తన జరుగుతుంది. సంఘం సుక్షేమంగా వెలుగుతున్నప్పుడు వ్యక్తి యొక్క స్వభావం కూడా సహజంగా మారుతుంది. ఈ మూడింటి పరివర్తన చేకూర్చడమే సాయి ఆశయం. SAI (సాయి) అనే పదంలో S-అనగా Spiritual change (ఆధ్యాత్మిక పరివర్తన): A అనగా Associational Change (సాంఘిక పరివర్తన): I అనగా Individual Change (వ్యక్తి యొక్క పరివర్తన) ఇదే సాయి ఆశయము. ఇట్టి పరివర్తన జరిగినప్పుడు ప్రపంచమంతా సుక్షేమంగా ఉంటుంది. ఈ మూడింటి యందు ఉన్న ఏకత్వమే ప్రేమతత్వము. దానిని మనము అనుభవించాలి.
(శ్రీ భ.ఉ.పు.184)