ప్రతి విషయంలోను మానవుడు అనుభవించుటకు ముందు చక్కగా విచారణ (Enquiry) సలిపి, పరిశీలన (Investigation) చేయాలి.
పరిశీలన జరిపినపుడే పరిశోధన (Research) కూడా లభ్యమవుతుంది. పరిశోధనల ఫలితాలను వినియోగించు కోవటానికి వివేకము ఉండాలి. అయితే ఈనాడు విజ్ఞానశాస్త్రరంగంలో వివేకాన్ని విస్మరిస్తున్నారు. విషయ పరిశోధనా ఫలితాన్ని వినయోగించుకోవటానికి వివేక మంత అవసరం. పరిశోధన, పరిశీలనల యందు సమత్వముండాలి. ఈనాడు పరిశోధన అధికంగానే సాగుతున్నదిగాని, పరిశీలన మాత్రం సలుపటం లేదు. ప్రతి విషయాన్ని మొదట చక్కగా విచారణ సలిపి, తరువాత శ్రద్ధగా పరిశీలన చేసి పరిశోధన చేయాలి. పరిశోధన ద్వారా లభ్యమైన విజ్ఞానాన్ని వివేకంతో ప్రపంచాభివృద్ధికి వినియోగించాలి. అయితే ఈనాడు వివేకం లోపించింది. వివేకం లేని విజ్ఞానం వలన దేశానికి ప్రమాదం.
(శ్రీజూ.97 పు.47)