ఈనాటి మానవుడు అర్థము. అధికారము రెండిటినిమిత్తమై ప్రాకులాడుతున్నాడు. అయితే ఈ రెండు ఉండవలసినవే. కాని వీటికి కొంత పరిమితి ఉండాలి.జగత్తును సస్యశ్యామలముగావించే సముద్రుడైనా తన పరిమితులను మీరితే అపకీర్తి పాలౌతాడు. దేహానికి, మనస్సుకు పుష్టిని, సంతుష్టిని అందించే ఆహారము కూడా అమితంగా భుజిస్తేఅజీర్ణ వ్యాధిని కలిగిస్తుంది. అంతేకాదు. మనం వేసుకునే తాంబూలమునకు ప్రధానమైనది. సున్నము. కాని దానినైనా అధికంగా ఉపయోగిస్తే నాలుక పాక్కిపోతుంది. కనుక దేనినైనా పరిమితంగా ఉపయోగించుకోవాలి. దృశ్యకల్పితమైన ఈ జగత్తులో ప్రతిదానికి ఒక పరిమితి ఉన్నది కాని, ప్రేమకు మాత్రం పరిమితిలేదు.
(స. సా.1996 డి.పు.310)
(చూ|| లిమిటెడ్ కంపెనీ)