పుట్టిన ప్రతివ్యక్తికి తన జీవితమున కొక అర్థమూ, పరమార్థమూ లభింప చేసినందుకు ఐదుగురు మాతృదేవతలకు ఋణపడి వుండును. మొదటిది దేహమాత అనగా కన్నతల్లి:రెండవది గోమాత, పాలిచ్చు గోవు మరియు భూమిదున్ను ఎద్దు: మూడవది భూమాత,తినుటకు తిండి ఉండుటకు చోటు యిచ్చి రక్షించిన తల్లి; నాలుగవది దేశమాత,సంస్కారం, సాంప్రదాయం, జీవితమునకొక లక్ష్యం అందించిన తల్లి: అయిదవది వేదమాత, ఆధ్యాత్మిక జ్ఞాననిధి. జన్మయిచ్చి, మిగిలిన మాతృదేవతలతో సంబంధము కలిగించిన దేహమాత అత్యంత పూజ్యురాలు. అందువలననే ప్రప్రధముగా కళాశాల మహిళల కొరకు స్థాపించి సర్వతోముఖమైన సనాతన ధర్మమునకు నాందివచనము పలుక సంకల్పించితిని.
(శ్రీ.స.సూ.పు.39)