కృష్ణుడు అర్జునుని కురునందవా యని సంబోధించాడు. కురునందనా అంటే యేమిటి? కురు+నందన కర్మను ఆచరించటములో ఆనందమును అనుభవించేవాడట అర్జునుడు. పనివున్న సమయమున మనము చాలా బేజారుగా వుంటాము. పనియందే అర్జునునికి ఆనందమట. మనకు ఆదివారం వచ్చిందంటే చాలా ఆనందము. ఎందుకంటే పని వుండదు. పనిలేనినాడు అర్జునుడు చాలా విచారిస్తాడట. ఎంత పని అధికముగా వుంటే అంత ఆనందించేవాడు అర్జునుడు. అర్జున, ఫల్గున, పార్థ, కిరీటి, శ్వేతవాహన, బీభత్స, సవ్యసాచి, విజయకృష్ణ,
ధనుంజయ యీ పేర్లకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అంతరార్థమును కృష్ణుడు నిరూపించాడు. ఈ ఇరువది ఆరు గుణములలోపల నిత్యము ఒక్కొక్క గుణమును గూర్చి చక్కగా గుర్తించటానికి ప్రయత్నించినప్పుడే దివ్యత్వమైన ఆత్మతత్వము మనకు అర్థమవుతుంది.
(శ్రీస. గీ. పు. 251)