కులమత ద్వేషాలు కూలద్రోయుడటంచు
చేయెత్తి బోధనల్ చేయవలయు
దీనుల సేవయే దివ్యమార్గమటంచు
పలుమారు గట్టిగా పలుక వలయు
నామ చింతన చేయు నరుని నామి సన్నిధి చేర్చి
అమృతత్త్యము నందించు నని నెరుగవలయు
భక్తి విశ్వాసములు బాగుగా కలిగిన వారలు
మనవారలని వచించవలయు
జ్ఞాన బోధలు నరులకు చేయువారు
ఇష్టులవుదురు ఎంతైన స్పష్టముగను
భేద భావంబు విడనాడి ప్రీతి తోడ
కలసి యుండుటయే మీరంత
సాయికి కలుగు ప్రేమ
ఇంతకన్న వేరెద్ది ఎఱుక పరతు
సాధు సద్గుణ గణ్యులో సభ్యులారా
(భ ప్ర. పు. 16/17)