ప్రతి ఒక్కటి దివ్యత్వముగాని, పవిత్రత గాని, అపవిత్రంగాని దుఃఖముగాని, ఆనందముగాని మనలో వుండినట్టివే. ఇది నీకు స్వాతంత్ర్యము కాదు,వున్నదే అది. ఇది స్వేచ్చ అనుకుంటే యిది స్వేచ్ఛకాదు కర్తృత్వము. కనుక ప్రీ విల్ అని చెప్పటములో దీనికి అర్థము లేదు. ఫ్రీ విల్ అనేది ఒక్కటే! అదే హృదయస్తాయి. అది ఎప్పటికి వున్నది. ఒక్క తూరి వచ్చి ఒక్క తూరి పోయేది కాదు. మనోభావము వుండినంత వరకు మానవునకు భిన్నభావములు అభివృద్ధి పొందుతుంటాయి. ఇవి మనస్సు యొక్క స్వాతంత్ర్యములే గాని మనిషి యొక్క స్వాతంత్ర్యము కాదు.
(బృృత్ర.పు. ౧౪౭/౧౪౭)
(చూ॥ ఫ్రీవిల్)