ఈనాడు మీకందరికి బాగా తెలుసు కంప్యూటర్సు గురించి, వైజ్ఞానికులు వీటిని సృష్టిస్తున్నారు. ఈ కంప్యూటర్లు ఎలాంటివి? కేవలం ఒక రబ్బిష్ వంటివి. పిండి మరలో పైన బియ్యం వేస్తే క్రింద బియ్యంపిండి వస్తుంది. పైన బేడలు వేస్తే క్రింద బేడలపిండి వస్తుంది. ఎలాంటిది వేస్తే లాంటిది వస్తుంది. అట్లే, కంప్యూటర్‌లో ఈ సైంటిస్టు ఏమి అడ్జస్టు చేస్తే ఆవిధముగా ఫలితమొస్తుంది. ఆ అడ్జస్ట్మెంటులో ఏదైనా కొంత పొరపాటు జరిగినా అంతా ప్రమాదమే. కంప్యూటర్స్ సరియైన ప్రమాణము కాదు. ఈ కంప్యూటర్సులో తెలిపే అన్నీ రిజల్ట్ సరికాదు. పాసయినవారిని ఫేల్ గాను ఫేల్ అయిన వారి పాగాను తెలుపుతుంటాయి ఒక్కొక్కసారి. కనుక ఈ యంత్ర ప్రమాణములంతా అల్పప్రమాణములే. కాని పరీక్ష వ్రాసిన వాని హృదయమే ప్రమాణము. నేను తప్పక పాసవుతాను అనే విశ్వాసమే అతనిని పాస్ గావిస్తుంది. ఈనాడు మూర్ఖ ప్రమాణాలన్నీ అభివృద్ధి అయిపోతూ వస్తున్నాయి. వీటన్నిటికీ మనస్సే కారణము.
(శ్రీస. ది. 1993 పు. 109)
ఈనాడు మానవుడు Computerని సృష్టించాడు. "వర్షము ఎప్పుడు రాబోతున్నది? నేను క్షేమముగా ఇల్లు ఎట్లు చేరగలను?" మొదలగు ప్రశ్నలను మనంComputersఅడిగినప్పుడు "నీవు ఒక గొడుగుపట్టుకో. ఇలా నడుచుకో, నీవు క్షేమంగా ఇల్లు చేరగలవు" అని జవాబు ఇస్తుంది. Computer ఇట్టి, జవాబును తనంతట తానే చెప్పుతుందా? కాదు, కాదు. మానవుడు దానిని తగిన రీతిలో క్రమ పరుస్తున్నాడు. ఈ Computer కేవలం ఒక చెత్త వంటిది. ఇట్టి యంత్రముపై విశ్వాసము పెట్టి, ఎన్ని కోట్ల రూపాయలను వ్యర్ధం చేస్తున్నారు. మానవుడు సహజసిద్ధమైన తెలివి తేటలు కలిగియున్నాడు. ఈ కంప్యూటర్ పని చేయడానికి కూడా మానవుని తెలివితేటలే కారణం. ఇట్టి తెలివితేటలను విశ్వసించకుండా, మనం నిర్మింపబడ్డ యంత్రాలను మనం నమ్ముతున్నాము. పిండి మరలో గోధుమలు వేస్తే గోధుమ పిండి మనకు లభిస్తుంది; బియ్యం వేస్తే బియ్యపు పిండే మనకు లభ్యమవుతుంది. కంప్యూటర్ పని తీరు కూడా ఇంతే. మనము దానిని ఏవిధంగా క్రమపరుస్తే, ఆవిధంగానే అది పనిచేస్తుంది. ఒక వేళ కంప్యూటర్ తనంతట తాను పనిచేయగలదని నీవు భావిస్తే దాని దగ్గరకు పోయి "నెనెప్పుడు చస్తాను?" అని అడుగు, చెబుతుందేమో చూద్దాం: కంప్యూటర్‌కు ఈ ప్రశ్నయొక్క జవాబు తెలియదు. కారణమేమనగా, ఈ యంత్రాన్ని నిర్మించిన మానవునకు కూడా దీని జవాబు తెలియదు. కనుక, Scientist తనకు తెలిసిన దానినే తిరిగి Computer లో పెడుతున్నాడు. సైంటిస్ట్ బింబం, కంప్యూటర్ ప్రతిబింబం, తనను తాను నమ్మటంలేదు గాని, తనద్వారా ఏర్పడిన ప్రతిబింబాన్ని మానవుడు నమ్ముతున్నాడు.