ఈ ఉపనిషత్తున యమునిచే బ్రహ్మతత్వోపదేశము నొంది కృతార్థ తను గాంచిన నచికేతుని చరిత్రమున పేర్కొనబడినది. ఇంతియేకాక, ఈయాఖ్యాయిక తైత్తిరీయ బ్రాహ్మణమునను. మహాభారతము అనుశాసన పర్వము సూటఆరవ అధ్యాయమునకూడ తెలుపబడినది. ఇది విషయ విమర్శనమునకు, భావకల్మనా గాంభీర్యములకును ప్రసిద్ధికెక్కినది. దీని యందలి అనేకమంత్రముల రూపములు భగవద్గీతయందు కనుపించుచున్నవి. కృష్ణయజర్వేదీయ చరకశాఖాన్తర్గత మగు కళశాఖా బ్రాహ్మణమునకు చెందియుండుటచేత ఈ ఉపనిషత్తునకు కఠోపనిషత్తు అని కూడను పేరు వచ్చినది.
(ఉ. వా. పు.14)